NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ , నారా లోకేష్ పై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. .టీడీపీ హయాంలో పెట్టుబడులన్నీ కేవలం నోటి మాటలే అని అన్నారు. ‘‘మీరు మాట్లాడితేనే.. ఇండస్ట్రీలు వచ్చేస్తాయా..?. ఎవరెవరికో సూటు-బూటు వేసి ఎంవోయులు చేసిన ఘనత బాబుదే. జపాన్ ప్రతినిధులు చెప్పింది విదేశాల్లో చదివిన లోకేష్ బుర్రకు అర్థం కాలేదా..?. ఐటీ శాఖా మంత్రిగా పనిచేసిన లోకేష్ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారు?. లోకేష్ చెప్పే కుంభకోణం.. మంగళవారం సామెతలా ఉంది. జగన్ మంచి కోరితే.. బాబు చావు కోరే రకం. రాష్ట్రాన్ని సీఎం జగన్ పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తున్నారు. బ్రాహ్మణి తో తగువులు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి. భారతమ్మ ను రాజకీయాల్లోకి లాగి.. బ్రాహ్మణి ని తిట్టించాలన్నదే లోకేష్ ఉద్దేశమా..?. లోకేష్ లా బీచ్‌ల్లో.. స్విమ్మింగ్ పూల్ చదువులు జగన్ చదవలేదు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని లోకేష్.. మాపై విమర్శలా?. మంగళగిరిలో లోకేష్‌కు మరోసారి సర్వ మంగళమే..!. “మనం” సినిమాలో మాదిరిగా మీ తండ్రీ కొడుకులు జూబ్లీ ప్యాలెస్‌లో శేష జీవితం గడపండి. బాబు స్క్రిప్టు, ప్రొడక్షన్- నాదెండ్ల డైరెక్షన్‌లో నడుస్తున్న మీ పార్టీ కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

                                                

About Author