ఇండియా పేరు మార్చాలన్న క్రికెటర్ భార్య !
1 min readపల్లెవెలుగువెబ్ : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాడుకలో ఉన్న ఇండియా పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని, అంచేత దేశం పేరును ఇండియా అని కాకుండా ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని సంబోదించేలా తగు సవరణలు చేపట్టాలని మోదీ, షాలను కోరింది. జహాన్ నిన్న (ఆగస్ట్ 14) ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మన దేశం పేరు ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని పెట్టండి. వీటితో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..’ అని రాసుకొచ్చింది.