ఫేషియల్ యాప్ ను రద్దు చేయండి : ఫ్యా ప్టో
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరకు ప్రవేశ పెట్టిన “ఫె సియల్ యాప్ ” ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పత్తికొండ మండలం విద్యా శాఖ అధికారి మేడం రంగస్వామికి ఫ్యాప్టో నాయకులు రామమోహన్ రెడ్డి(STUAP),భాస్కర్(UTF), పాండురంగా రెడ్డి (APTF),అబ్రహం(DTF)నాయకులు బుధవారం విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం తదితర వివరాలు అప్లోడు చేయుటకు పాఠశాల విద్యా శాఖ ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్ యాప్ మాస్వంత పోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని,వారు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.సదరు యాప్ డౌన్లోడ్ చేయుట వలన మా వ్యక్తిగత సమాచారమునకు భద్రత లేకుండా పోతోందని వారు భయాందోళన చెందుతున్నట్లు తెలియచేశారు.అందుకే ఈ యాప్ ను వ్యతిరేకిస్తున్నామన్నారు.దీనికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.ఈ కార్యక్రమంలో బలరాముడు, వెంకటరాముడు,వన్నూరప్ప, చెన్నకేశవరావు, వీరెస్, లోక్యా నాయక్, సత్యనాాయణ, మండ్ల వెంకటేశ్వర్లు,పాండు పాల్గొన్నారు.