అత్యధిక వాయి కాలుష్యం ఉన్న నగరం ఏదంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్య తీవ్రత భారీగా పెరిగిపోతున్న 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది. 2010-2019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 7వేల నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ బుధవారం ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లోని పీఎం2.5 సగటు స్థాయిలను పరిశీలిస్తే.. ఢిల్లీలోనే అత్యంత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. పీఎం2.5 కాలుష్యం కారణంగా 2019లో 7239 నగరాల్లో 17 లక్షల మరణాలు సంభవించాయని పరిశోధకులు వెల్లడించారు.