PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండ‌స్ట్రీలో గిల్లితే గిల్లించుకోవాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ ఇండస్ట్రీలో మహిళలను ఎలా చూస్తారో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్‌ అంటే కెమరా ముందు కాపాడండి.. లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా.. సేమ్‌ ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది. మా హక్కుల కోసం మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తారు. హీరోయిన్‌ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు. కానీ అది చాలా తప్పు’ అంటూ చెప్పుకొచ్చింది.

                                               

About Author