పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్ డేట్ గడువు పెంపు
1 min readపల్లెవెలుగువెబ్ : పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ద్వారా అర్హులైన కోట్లాదిమంది రైతులకు 12వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 1న ఈ నగదును రైతుల ఖాతాల్లో జమచేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ-కేవైసీ అప్డేట్ చేసుకొని రైతన్నలకు మరో అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువును ఆగస్టు 31వ తేదీ దాకా పొడిగించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12వ విడత నగదు పొందాలంటే ఈ-కేవైసీ అప్డేట్ తప్పనిసరి.