NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీని వీడిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉమ్మడి పాలమూరు మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు పార్టీని వీడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. దీంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే తదుపరి నిర్ణయమని చెబుతున్నా.. కాంగ్రెస్‌లోనే చేరేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో కొత్తకోట దంపతులు కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాల్లో వీరే కీలకంగా ఉన్నారు. అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు దయాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

                                        

About Author