ఈ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు !
1 min readపల్లెవెలుగువెబ్ : టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ ఉత్పత్తులంటేనే భద్రతకు మారు పేరు. హ్యాకింగ్‌కు వీల్లేనంత పకడ్బందీగా ఉంటాయా సంస్థ పరికరాలు. అయితే, అలాంటి ఉత్పత్తులకు కూడా భద్రతాపరమైన ముప్పు ఏర్పడింది. ఐ ఫోన్లు, ఐ ప్యాడ్‌లు, మ్యాక్ బుక్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటూ యాపిల్ శుక్రవారం ప్రకటించింది. ఈ డివైజ్‌లను హ్యాకర్లు పూర్తిగా నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి సంబంధించి రెండు భద్రతాపరమైన నివేదికలను విడుదల చేసింది.