మాజీ మంత్రి ఎమ్మెస్సార్ ఇక లేరు..!
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు ఇకలేరు. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోన బారినపడ్డారు. తెల్లవారు ఝామున 3 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెస్సార్ పలు కీలక పదవులు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా కూడ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెస్సార్ ది విడదీయరాని బంధం. ఆయన మృతికి పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.