మెరుగైన సాగు పద్ధతులపై మెళకువలు
1 min readపల్లె వెలుగు, రుద్రవరం; రబీలో సాగు చేసిన మినుము వరి మొక్కజొన్న పంటలపై మేలైన సాగు పద్ధతులను ఆళ్లగడ్డ వ్యవసాయ సహాయ సంచాలకులు వరప్రసాద్ వ్యవసాయ అధికారి ప్రసాదరావు రైతులకు వివరించారు. ఆత్మ పథకం లో భాగంగా మండలంలోని చిన్నకంబలూరు గ్రామంలో మంగళవారం రబీలో సాగు చేసిన పంటలపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రబీలో సాగు చేసిన మినుము వరి మొక్కజొన్న లో చేపట్టవలసిన మేలైన సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. ప్రధానంగా వరి మినుము పంటలు చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు ఇందులో పొలం ఘట్లను శుభ్రంగా ఉంచుకోవాలని పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని లింగాకర్షక బుట్టల తో పాటు పసుపుపచ్చని జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని వీటితో పాటు తదితర అంశాలపై రైతులకు వివరించారు. పంటలు సస్యరక్షణ చేపట్టడం వలన వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి నికర ఆదాయం పెంచుకొనుటకు వీలు కలుగుతుందని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.