ఆ టెక్నాలజీతో 2 కోట్ల ఉద్యోగాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపుతున్న ఐదో తరం సెల్యులార్ నెట్‌వర్క్ టెక్నాలజీ ‘5జీ’భారత్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. నూతన 5జీ సాంకేతికత కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ‘టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్’(టీఎస్‌ఎస్‌సీ) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా సేవలు అందిస్తున్న సంస్థలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నా లజీ ఆధారిత ఉద్యోగాల కల్పనలో ముందంజలో ఉంది.