లాభాలు రాలేదని 900 మంది ఉద్యోగులపై వేటు !
1 min readపల్లెవెలుగువెబ్ : షావోమీ క్యూ2 ఫలితాల్ని విడుదల చేసింది. ఆ ఫలితాల్లో షావోమీ సేల్స్ 20శాతం పడిపోయాయి. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ2లో ఆశించిన ఫలితాలు రాలేదని షావోమీ యాజమాన్యం తెలిపింది. నిరాశజనకమైన ఫలితాలతో దాదాపూ 3శాతం తన వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఉద్యోగుల తొలగింపుపై కారణాలు తెలియాల్సి ఉండగా.. షావోమీ త్రైమాసిక లక్ష్యాన్ని సాధించలేకపోయింది. జూన్ త్రైమాసికంలో ఆ సంస్థ లాభాలు 20 శాతం పడిపోయిందని, మొత్తం ఉన్న ఉద్యోగుల్లో 900మందిని విధుల నుంచి తొలగించినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.