NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారా లోకేష్ అక్రమ అరెస్ట్… పోలీసుల తీరుపై ఆగ్రహం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కమలాపురం:వైసీపీ పాలనలో ఇబ్బందులకు గురైనా పలాస ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ ను ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం హేయమైన చర్య అని  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమాలపురం లో ఆదివారం           ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం నాడు నార లోకేష్ బాబు ను పోలీసులు ఆడ్డుకున్న విషయన్ని చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేక నియంతృత్వ పాలన కొనసాగుతోందా అని ప్రజలు భావిస్తున్నారన్నారు గతంలో ర్యాలీలను ధర్నాలను ఇతర ఆందోళన కార్యక్రమాలు చేస్తే అడ్డుకునే పోలీసులు ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో నాయకులు మీడియా సమావేశాలు కూడా నిర్వహించకుండా అనుమతులు లేవని అడ్డుకోవడం సిగ్గు చెటైన విషయం ఆన్నారు నార లోకేష్ మీడియా సమావేశాన్ని బహిరంగంగా పోలీసులు అడ్డు కోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. ఈ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలనే గతంలో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అవలంభించి ఉంటే వైసీపీ పార్టీ కి పుట్టగతులు ఉండేవి కాదన్నారు.. వైసీపీ పార్టీ వారి దురాగతాలకు త్వరలోనే మంగళం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

About Author