NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లేఖనే…మరణ వాంగ్మూలంగా తీసుకోవాలి: టీడీపీ

1 min read

టీడీపీ ఎస్సీ సెల్​ జిల్లా అధ్యక్షులు దరూరు జేమ్స్

పల్లెవెలుగు వెబ్​: నెల్లూరు జిల్లా కావలి సమీప గ్రామం ముసనూరుకు చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కర్నాకర్ ను వేధించి ఆయన ఆతహత్యకు కారణమైన YSRCP నేతలు జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి లను కటినంగా శిక్షించాలంటూ కర్నూలు జిల్లా టిడిపి SC సెల్ అధ్యక్షులు దరూరు జేమ్స్ అధ్యక్షతన కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరశన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు  సోమిషెట్టి వేంకటేశ్వర్లు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర గొర్రెల పెంపకం కార్పోరేషన్ చైర్మన్ Y నాగేశ్వర రావు యాదవ్ మరియు రాష్ట్ర SC సెల్ కార్యదర్శి M.లక్ష్మినారాయణ(ఆదోని) రాష్ట్రSC సెల్ కార్యదర్శి S. జయరాం  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి నేడు దళితులకు రక్షణ కల్పించలేక పోవటం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు.   టిడిపి రాష్ట్ర కార్యదర్శి కె నాగేంద్ర కుమార్ Y. నాగేశ్వర రావు యాదవ్ మాట్లాడుతూ దళిత యువకుడు దుగ్గిరాల కర్ణాకర్ ఆత్మహత్యకు కారణం అయిన YSRCP నాయకులకు తక్షణమే అరెస్టు చేయాలని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నూలు పార్లమెంట్ టిడిపి SC సెల్ అధ్యక్షులు దరూరు జేమ్స్ మాట్లాడుతూ దళిత యువకుడు దుగ్గిరాల కర్ణాకర్ గారు నేల్లూరు SC గారికి రాసిన లేకనే మరణ వాంగ్మూలంగా పరిగణించి దుగ్గిరాల కరణాకర్ ఆత్మహత్యకు కారణమై ysrcp నాయకులు జగదీశ్వర్ రెడ్డినీ, సురేష్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముడుమాల రాజశేఖర్,M. మనోహర్ బాబు,M. రామకృష్ణ బాబు, దరూరు బజార్న, వుయ్యలవాడ రమేశ్, మాజీ కార్పొరేటర్ సుంకన్న,ప్రభాకర్,mvn రాజు యాదవ్, చంద్రకళ భాయి, చీన్న పెంచలయ్య, ఈస్వరావు,  జాషువ, వినోద్, నాగరాజు, M. నాగరాజు, ధరూరు యశ్వంత్, దరూరు రాంప్రకాష్, దినేశ్, చిట్టిబాబు (ఆదోని) జగదీష్ (ఆదోని) తదీతతరులు ఉన్నారు.

About Author