PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘సీపీఎస్​’ ఉద్యోగులకు… నోటీసులు

1 min read

 ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్

పల్లెవెలుగువెబ్​: సిపియస్ రద్దు కు ఉద్యోగస్తులు లక్షలాదిగా సెప్టెంబర్ 1 వ తేదిన విజయవాడలో మిలియన్ మార్చ్,  గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి కి పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున సిపియస్ ఉద్యోగస్తులు పాల్గొనడానికి వెళుతున్నారనే  సమాచారం ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉంటూ  ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా కాండక్ట్ రూల్స్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం పై దాడి అను ప్రకటన చేయడం చట్టరీత్యా నేరం. చట్టరీత్యా అక్రమ సమావేశంగా , వ్యూహత్మకంగా, కుట్రపూరితంగా రాష్ట్ర అత్యున్నత పరిపాలన విభాగం లో అక్రమ ప్రవేశం చేసి ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ,  అక్రమ నిర్బంధం చేయడం మరియు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వంటివి నేరపూరిత చర్యల కింద పరిగణింపబడి తదనుగుణంగా సెక్షన్ 143 , 452, 427, 506 342, 353, r/w 120 (b) ఐపిసి మరియు  సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్టు చట్టాల క్రింద తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  కావున ఉద్యోగస్తులందరూ చట్ట వ్యతిరేకంగా ప్రకటించిన విధంగా మిలియన్ మార్చ్ మరియు సిఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను విరమించుకోవాలని  జిల్లా ఎస్పీ తెలియజేశారు.లేని యెడల తదుపరి చట్టపరంగా జరిగే చర్యలకు ఉద్యోగస్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.   ఈ సంధర్బంగా సదుద్దేశ్యంతో ముందు జాగ్రత్త చర్యగా సిపియస్ ఉద్యోగులకు నోటిసులు కూడా అందజేయడమైనదని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.

About Author