NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ‌ణేష్ మండ‌పాల‌కు డ‌బ్బు వ‌సూలు చేయడం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వినాయ‌క చ‌వితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ వెల్లడించారు. ఈ ప్రచారంలో నిజంలేదని అన్నారు. వినాయకచవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. గణేశ్ మండపాలు ఏర్పాటు చేయదలిచినవారు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రందించాలని అన్నారు. చట్టపరంగా అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. అంతకుమించి ఎలాంటి రుసుం గానీ, చందాలు గానీ తీసుకున్నా, అందుకు ప్రేరేపించినా… వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరి జవహర్ లాల్ వెల్లడించారు. ఎక్కడైనా వినాయక మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందితే, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు.

                              

About Author