కర్నూలు సేఫ్ సిటీ.. లక్ష్యం: ఎస్పీ
1 min readనగరంలో పోలీసుల విస్తృత తనిఖీ
పల్లెవెలుగు వెబ్: కర్నూలు సేఫ్ సిటిలో భాగంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ప్రతి రోజు రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై , అర్ధరాత్రి అనవసరంగా రోడ్ల పై తిరిగే యువకులను హెచ్చరిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా తిరుగుతున్నయువకుల వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసాంఘిక కార్యక్రమాలు , అసాంఘిక శక్తులను అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు రాత్రి పెట్రోలింగ్ ను పటిష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది యువతను రాత్రి గస్తీ పోలీసులు ప్రశ్నించడంతో కర్నూలు ప్రజలు కూడా హార్ష్యం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు – నందికొట్కూరు రోడ్డు దగ్గర ఆదివారం రాత్రి సెక్టార్ – 6 లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్ రెడ్డి మరియు పోలీసులు తనిఖీలు నిర్వహించి బహిరంగంగా మద్యపానం సేవిస్తున్న ముగ్గురి ని పట్టుకుని కేసులు నమోదు చేశారు. కర్నూలు సేఫ్ సిటిలో భాగంగా బహిరంగంగా మద్యపానం సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకుని కోర్టు ముందు ప్రవేశ పెడుతున్నారని , బహింగ ప్రదేశాలలో ప్రజలు మద్యం సేవించడం నేరమని, అత్యవసరమైతే తప్ప అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా రోడ్డు పై తిరగకూడదని పోలీసులు యువత ను హెచ్చరిస్తున్నారు.