మూడు నెలలు వండి.. 8 నెలలు తిన్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీ షా అనే గృహిణి వినూత్నమైన ఆలోచన చేసింది. ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాలోని ఇండియానాలో స్థిరపడింది. కుటుంబ సభ్యులకు వండి పెట్టడానికి ఆమెకు చాలా సమయం పట్టేది. దీంతో ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులపై దృష్టి పెట్టారు. ఇంటర్నెట్‌తోపాటు పుస్తకాల ద్వారా సమాచారం సేకరించారు. ఇందుకోసం రోజుకు 2 గంటలు కేటాయించారు. 3 నెలల పాటు 426 మీల్స్ సిద్ధం చేసి, నిల్వచేశారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఈ నిల్వ ఆహారమే వారికి దాదాపు 8 నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. డీహైడ్రేషన్, వాటర్ క్యానింగ్ పద్ధతుల్లో ఆహారాన్ని చాలారోజులు నిల్వ చేయొచ్చని, తాజాగా ఉంటుందని కెల్సీ షా చెప్పారు.