వైట్ రైస్ తింటే బరువు పెరుగుతారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : వైట్ రైస్‌లో రెసిస్టెంట్ స్టార్చ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ప్రపంచంలో అనేక సంస్కృతులలో ప్రధాన ఆహారంగా ఉన్న తెల్ల బియ్యం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. ప్రపంచంలో అనేక సంస్కృతులలో తెల్లబియ్యం ప్రధాన ఆహారం. కొవ్వు తక్కువగా ఉండి పండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కూడా ఇందులో ఎక్కువగానే ఉంటాయి. మామూలుగా మనందరిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే రోజూ తినే ఆహారంలో వైట్ రైస్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని కంగారు పడుతుంటాం. ఒక కప్పు వండిన అన్నంలో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. ఇది రోజువారీ 2000 కేలరీలలో 10 శాతం మాత్రమే. అంతే కాదు వైట్ రైస్ లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మన ఆహారంలో సమతుల్యం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చు.