బావిలోనైనా దూకుతా కానీ.. !
1 min readపల్లెవెలుగువెబ్ : బావిలోనైనా దూకుతా కానీ కాంగ్రెస్ మాత్రం చేరనని తాను గతంలో అన్న మాటలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తనను తొలగించడంపై ఇంత వరకు స్పందించ ని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా బీజేపీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్ చేరే ఉద్దేశం లేదనే సూచనలిచ్చారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘నా స్నేహితుడు, దివంగత కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ జిచ్కార్ నన్ను కాంగ్రె స్లో చేరాలని అడిగారు. అప్పుడు నేను బావిలోనైనా దూకుతా కానీ కాంగ్రెస్ లో మాత్రం చేరను.. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చవు అని చెప్పాను’’ అని వెల్లడించారు.