గణేష్ ఉత్సవాల పై ఆంక్షలు సరికాదు
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో ట్విట్టర్ లో స్పందించారు. వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ఏకంచేసి, వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాంటి గణేశ్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.