తాజ్ మహల్ పేరు మార్చుతారా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : తాజ్ మహల్ పేరును తేజో మహాలయ గా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ శోభారామ్ రాథోడ్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆయన బుధవారం ఆగ్రా నగర పాలక సంస్థకు సమర్పిస్తారు. దీనిపై నగర పాలక సంస్థ సభ్యులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. తాజ్ మహల్‌లో కమలంతో కూడిన కలశం ఉన్నట్లు రుజువులు తన వద్ద ఉన్నాయని శోభారాం రాథోడ్ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజ్ మహల్ గురించి అసలు నిజాలు తెలుసుకునేందుకు దానిలో తాళాలు వేసి ఉన్న 22 గదులను తెరవాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది.