ఫెయిల్ చేశాడని.. టీచర్ ను కట్టేసి కొట్టారు !
1 min readపల్లెవెలుగువెబ్ : విద్యాబుద్ధులు నేర్పే గురువులను ధైవంతో సమానంగా చూడాలంటారు పెద్దలు. కొన్నేళ్ల క్రితం అలాగే ఉండేది.. గురువుల పట్ల ఎంతో వినయంగా, భయం, భక్తితో మెలిగేవారు విద్యార్థులు. కానీ, ఇప్పుడు కాలం మారింది. గురువులనే ఎదురించే శిష్యులు తయారయ్యారు. అలాంటి సంఘటనే జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. 9వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశారని ఓ గణితం టీచర్, క్లర్క్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు కొందరు విద్యార్థులు. గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో గత సోమవారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.