కార్డుదారులకు అదనంగా 5 కేజీల బియ్యం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా ప్రతి కార్డు దారుడికి మే నెల నుంచి 5 కేజీల బియ్యం అదనంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి ఎండీయూ వాహనం ద్వారా ఉచితంగా బియ్యం, నిర్ణీత ధరలకు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.