నావికా దళం కొత్త జెండా ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగువెబ్ : భారత నావికా దళం నూతన పతాకంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతాకాన్ని రూపొందించారు. నూతన పతాకంలో ఎడమవైపు పై భాగంలో జాతీయ పతాకం ఉంది. కుడివైపు అష్ట భుజులు రెండు ఉన్నాయి. వాటి మధ్యలో ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ లంగరు క్రింద ‘సం నో వరుణః’ అనే నినాదం ఉంది. దీనిని వేదాల నుంచి స్వీకరించారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునే మాట ఇది. ‘వరుణ దేవా! మా పట్ల దయ చూపించి, మాకు విజయాన్ని ప్రసాదించు’ అని దీని భావం.