కాసుల వర్షం కురిపించిన కెమికల్ కంపెనీ !
1 min readపల్లెవెలుగువెబ్ : కెమికల్ ఇండస్ట్రీలో లార్జ్-క్యాప్ కంపెనీ అయిన ఆర్తి ఇండస్ట్రీస్ కాసుల వర్షం కురిపించింది. రూ.28,688.57 కోట్ల మార్కెట్ వాల్యూయేషన్ కలిగి ఉన్న ఈ కంపెనీ షేరు, తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించింది. లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులను కోటీశ్వరుల్ని చేసింది. 23 ఏళ్ల క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి డబ్బులను ప్రస్తుతం రూ.7.32 కోట్లుగా మార్చింది. ఒకప్పుడు రూపాయిగా ఉన్న ఆర్తి ఇండస్ట్రీస్ షేరు ధర ప్రస్తుతం రూ.791కి పెరిగింది. ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారత ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ. స్పెషాలిటీ కెమికల్ రంగంలో కూడా ఈ కంపెనీ ఉంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రోకెమికల్స్, పాలీమర్స్, పిగ్మెంట్స్, డైస్ ప్రొడక్షన్లో వాడే కెమికల్స్‌ను ఈ కంపెనీ జనరేట్ చేస్తుంది.