PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంగు మారుతున్న స‌ముద్రాలు.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సాధారణంగా సముద్రాలు నీలి రంగులోనే ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు.. కానీ మన దగ్గర ఉండే.. ఒక్క బంగాళా ఖాతం మాత్రం అందుకు భిన్నం.. ఎందుకంటే బంగాళాఖాతం.. మన దగ్గర ఉండే బావులు, చెరువులు, నదుల రంగులో ఉంటుంది. అయితే ఉన్నట్టుండి.. మన సముద్రం ఒక్కసారిగా నీలిరంగులోకి మారింది. దీంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య సముద్ర తీరం మొత్తం నల్లగా మారింది. ఎందుకు ఇలా మారింది అన్నదానిపై పూర్తి అవగాహన రాకముందే.. ఇప్పుడు ఇలా ఓ చోట సముద్రం నీలి రంగులా మారింది..? మరి ఈ నీలం రుంగు మార్పు వెనక కారణాలేమై ఉన్నాయా..? తరుచూ ఇలా సముద్రం రంగులు ఎందుకు మారుస్తోంది. విశాఖ తీరం లో జోరుగా వినిపిస్తోన్న ప్రశ్న. ఎందుకంటే మహా సముద్రాలు నీలిరంగులో ఉండటానికి ప్రధాన కారణం.. ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి అన్న సిద్ధాంతం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆకాశపు రంగు నీటిపై ప్రతిబింబించడం వల్లే ఇలా జరుగుతుందన్న మాట వింటూనే ఉంటాం. కానీ ఇదొక్కటే కారణం కాదంటారు శాస్త్రజ్జులు. నీటి అణువులు కాంతి కిరణాలను గ్రహించి వెదజల్లడం వల్లే సముద్రం నీలి రంగులో కనిపిస్తుందన్న విశ్లేషణలున్నాయి.

                                      

About Author