PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిల‌య‌న్స్ లాభం 13 వేల కోట్లు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నాలుగో త్రైమాసికంలో రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు సాధించింది. నిక‌ర లాభం 129 శాతం పెరిగి.. 13,227 కోట్లకు చేరింది. గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నిక‌ర లాభం 6,348 కోట్లు ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం 1,72,000 కోట్లకు చేరింది. రిల‌య‌న్స్ జియో, రిల‌య‌న్స్ రిటైల్ విభాగాల‌తో పాటు పెట్రోకెమిక‌ల్ విభాగంలో కూడ మంచి లాభాలు రావ‌డం.. రిల‌య‌న్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
రిల‌య‌న్స్ జియో: జియో లాభం 3,508 కోట్లకు చేరింది. ఈ రంగ‌లో 47.5 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం 19 శాతం పెరిగి 18,278 కోట్ల ఆదాయం వ‌చ్చింది. మార్చి చివ‌రి నాటికి రిల‌య‌న్స్ జియో వినియోగ‌దారుల సంఖ్య 42.62 కోట్లకు చేరింది. స‌గ‌టు వినియోదారుని ఆదాయం 138.2 రూపాయ‌ల‌కు చేరింది.
రిల‌య‌న్స్ రిటైల్: ఎల‌క్ట్రానిక్స్ విభాగంలో వృద్ధి న‌మోద‌వ్వడంతో రిల‌య‌న్స్ రిటైల్ లాభాలు పెరిగాయి. క‌రోన నేప‌థ్యంలో వినియోగ‌దారుల రాక త‌గ్గిన‌ప్పటికీ ఎల‌క్ట్రానిక్స్ విభాగంలో పెరిగిన అమ్మకాల‌తో రిల‌య‌న్స్ రిటైల్ కు మంచి లాభాలు వ‌చ్చాయి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ (పీబీటీ) 3,632 కోట్లుగా ఉంది.
డివిడెండ్ : రియ‌ల‌న్స్ ఇండస్ట్రీస్ ఎబిడిటాలు పెర‌గ‌డంతో మంచి లాభాలు వ‌చ్చాయి. దీంతో కంపెనీ షేర్ హోల్డర్లుకు డివిడెండ్ ప్రక‌టించింది. ఈ డివిడెండ్ ఒక్కో షేరు కు 7 రూపాయ‌లు చెల్లించ‌నుంది.

About Author