ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్లను గుర్తించండి
1 min read– కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించండి
– సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: ప్రభుత్వ, అనుమతి పొందిన ప్రైవేట్ ఆస్పత్రల్లో ఖాళీ బెడ్లను గుర్తించి… కోవిడ్ బాధితులకు కేటాయించాలని, ఇందుకు ఆస్పత్రుల యజమాన్యాలతో సమన్వయం చేసుకోవాలని సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర సూచించారు. 104 కాల్ సెంటర్ ద్వారా అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లోని బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు టోకెన్లు రేజ్ చేయాలని, పేషెంట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హోమ్ క్వాంటైన్కు, సిసిసి కి, ఆక్సిజన్ అవసరం ఉన్న, అవసరం లేని బెడ్డు వివరాలతో నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మరిన్ని ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతి ఇచ్చామని సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర వెల్లడించారు.