PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేర్​ సెంటర్లలో 10 ఆక్సిజన్​ బెడ్స్​ సిద్ధం చేయండి

1 min read

– బాధితులకు మెరుగైన సేవలు అందించండి
– కోవిడ్​ మరణాలు ఉండకూడదు
– వీసీలో కోవిడ్​ కేర్​ సెంటర్​ అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో పది ఆక్సిజన్ బెడ్స్ లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కోవిడ్ కేర్ సెంటర్ అధికారులకు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్​ నుంచి కోవిడ్ కేర్ సెంటర్లలో మౌలిక సదుపాయాలు, కరోన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సంబంధిత కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) ఎస్.రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లలో 4500 బెడ్స్ కు అన్ని వసతులు కల్పించి అడిషనల్ గా 4వేల బెడ్స్ ను సిద్ధం చేసి ఫ్యాన్, ట్యూబ్ లైట్, పవర్ సప్లై, వాటర్ సప్లై, బెడ్స్, వెల్కమ్ కిట్, మెడిసిన్స్ తదితర మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత నోడల్ టీమ్ కు ఆదేశించారు. పాజిటివ్ పేషేంట్స్ ను అంబులెన్స్ లలో వెంటనే తరలింపు, అడ్మిషన్స్, మందులు, ఈ.సి.జి యంత్రాల ఏర్పాటు, మొబైల్ ఎక్స్ రే, శానిటేషన్, నీటి సదుపాయం, ఫుడ్, మెడికల్ కేర్ అన్ని బాగా ఉండేలా చూడాలని సూచించారు. వీలైనంతవరకు ఒక్కరు కూడా కరోనతో మరణించ కూడదు… ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా కోవిడ్ కేర్ సెంటర్లను పర్యవేక్షించాలన్నారు.

About Author