అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులు వారే !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ తలపై రుపాయి పెడితే.. పావలాకు కూడ పనికిరాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి పేరును ప్రస్తావిస్తూ లోకేష్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. మంత్రి కాకాణి గురువారం కౌంటర్ ఇచ్చారు. లోకేష్ ముందుగా తన తండ్రి, తాతల చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు రైతుల పొలాల్లో రాత్రిళ్లు వేరుశెనగ బస్తాలు ఎత్తెకెళ్లేవాడని మంత్రి కాకాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గతంలో జేబులు కొట్టేవాడన్న సంగతి అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని సెటైర్లు వేశారు. అసలు చంద్రబాబు రాష్ట్రంలో జన్మించడమే పెద్ద శాపమని దుయ్యబట్టారు.