భారత్ లో ఐఫోన్ తయారీ !
1 min readపల్లెవెలుగువెబ్ : యాపిల్ తన ఉత్పాదనను చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కారణంగా ఐఫోన్ 14 సిరీస్ ఉత్పత్తిని భారత్ కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తైవాన్ కంపెనీలు భారత్ లో తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్, విస్ట్రన్ కార్ప్ ప్రస్తుతం ఆపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్ ప్లాంట్‌ను స్థాపించి ఐఫోన్‌ను అసెంబుల్ చేసేందుకు టాటా విస్ట్రాన్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఆపిల్ తయారీలో వినియోగించే అనేక కాంపొనెంన్ట్స్ ఎక్కువగా చైనాలోనే తయారవుతున్నాయి. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న ఇతర తైవాన్ తయారీ సంస్థలు సైతం చైనాను వీడాలని యోచిస్తున్నాయి. ఈ కారణంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.