స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పడు ఇవి గుర్తు పెట్టుకోండి
1 min readపల్లెవెలుగువెబ్ : స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్వెస్ట్ చేసినప్పుడు హఠాత్తుగా స్టాక్ పెరిగితే మంచి రిటర్న్స్ రావొచ్చు. కానీ స్టాక్స్‌లో పెట్టుబడికి ఓపిక అవసరం. మూడేళ్లు కనీసం వేచి చూడాలి. అప్పుడు మంచి రిటర్న్స్ రావొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమోటర్ హానెస్టీ, మూలధనాన్ని తెలివిగా కేటాయించే కంపెనీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రమోటర్ నిజాయితీని చూడాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా, నిజాయితీ కలిగిన ప్రమోటర్స్‌ను చూడాలి. అలాగే, ప్రమోటర్ తెలివిగా కేటాయించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గత దశాబ్ద కాలంలో లేదా అంతకుమించిన సమయంలో ప్రమోటర్ మూలధనాన్ని తెలివిగా కేటాయిస్తున్నాడా లేదా చూడాలి. మూడో విషయం ఏమంటే మార్కెట్లో ప్రాబల్యం కలిగిన వాటిని చూడాలి. ఇన్వెస్టర్ ఎవరు కూడా సాధ్యమైనంత వరకు విడిచిపెట్టని వాటిని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.