NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ సొంత జిల్లాలో.. బుర‌ద‌లో యువ‌కుడి పొర్లుదండాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డప జిల్లాలో ఓ యువకుడి వినూత్న ప్రదర్శన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ జగన్ అన్నా కాపాడు అంటూ.. బురదలో పొర్లు దండాలు పెడుతూ వినూత్నంగా నిరసనకు దిగాడు. ఈ నిరసనే కాదు.. చాలా రోజుల నుంచి ఏపీలో రోడ్ల పరిస్థితిని ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం డిజిటల్ ఉద్యమం చేపట్టడంతో ఏపీలో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయా అనే చాలా జరుగుతోంది. చాలా రోజు లనుంచి ఏపీలో రోడ్లపై రచ్చ ఆగడం లేదు. రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై గుంతలతో జనాలు పడుతున్న బాధకు కాస్త కామెడీ టచ్ ఇస్తున్నారు నెటిజన్లు. అయితే తాజాగా ఓ యువకుడు సీఎం సొంత జిల్లాలో వినూత్న నిరసనలు చేపట్టడం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కొత్త బస్వాపురం గ్రామంలో రహదారి సౌకర్యం లేదంటూ ఓ యువకుడు ఇలా నిరసనకు దిగాడు.

                               

About Author