టీకా పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేస్తారని, అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఆర్డీ ఓ కల్పనాకుమారి ప్రజలకు సూచించారు. మహానంది, తమ్మడపల్లె గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన టీకీ కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగిస్తూ ఉండాలని, భౌతికదూరం పాటించాలని , ఎప్పటికప్పుడు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. మహానందిలో కోవిడ్ సోకిన ఐసోలేషన్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు .వారికి అందుతున్న వైద్యం మందులు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మహానది తాసిల్దార్ నారాయణ రెడ్డితిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిన్న లింగన్న మహానంది తమ్మడపల్లె గ్రామపంచాయతీకార్యదర్శులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.