జాతీయ బీసీ సంక్షేమ సంఘం సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడిగా బోధనం చంద్రశేఖర్ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడిగా బోధనం చంద్రశేఖర్ యాదవ్ ను జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ హోటల్ సూరజ్ గ్రాండ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా బోధనం చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, నాకు ఇచ్చిన పదవిని బీసీల అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేశారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి విజయ గౌరీ యాదవ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి వీరి ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ వై నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలు ఐక్యమత్యంగా పోరాటానికి సన్నద్ధం కావాలని చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీల కుల గణన చేయాలని కేంద్ర పరిధిలో బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లో ప్రైవేట్ సెక్టార్ లో కూడా నిష్పత్తి ప్రకారం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం 56 కార్పొరేషన్ లను ఏర్పాటు చేసిందని నిధులు విధులు కల్పించాలని బీసీల సమస్యలను పరిష్కరిస్తూ గ్రామీణ స్థాయి నుంచి బీసీ సంఘాల్ని బలోపేతం చేస్తూ సంఘం నిర్మాణం చేపట్టాలని అన్నారు నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై వేణుగోపాల్ నాయుడు నంద్యాల జిల్లా గౌరవ సలహాదారులుగా డి సోమశేఖర్ నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వై శ్రీనివాసులు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా క్రాంతి కుమార్ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా సోక్రబి జిల్లా కార్యదర్శిగా మహేష్ కురువ రాముడు లీగల్ అడ్వకేట్ ఉపాధ్యక్షులుగా మధు నంద్యాల జిల్లా డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా డాక్టర్ బండార్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో అంగజాల కృష్ణ యాదవ్ బోధనం గీతాంజలి యాదవ్ నాళి విజయ శేఖర్ అంగజాల సుబ్బయ్య బలపనూరు వెంకటేశ్వర్లు సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.