రౌడీ షీట్ల పై హైకోర్టు కీలక ఆదేశాలు
1 min readపల్లెవెలుగువెబ్ : పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఆధారంగా రౌడీషీట్లు తెరవడం, వాటిని సుధీర్ఘ కాలంపాటు కొనసాగించడం, వ్యక్తులపై నిఘా పెట్టడం వంటివి వీల్లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు తిరిగి తెరవడానికి వీల్లేదని పోలీసులకు తేల్చి చెప్పింది. తాజాగా ఏమైనా ఆధారాలు లభిస్తే వాటి ప్రకారం ఆయా వ్యక్తులపై ఆయా షీట్లు తెరిచేందుకు పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది. నిందితుడు, అనుమానితుడిపై నిఘా ఉంచాలనుకుంటే ప్రస్తుతానికి పీఎ్‌సవో ప్రకారం వ్యవహరించవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి లేదా నిందితుడిని స్టేషన్‌కు పిలవాలనుకుంటే చట్టప్రకారం ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని తెలిపింది.