పెన్షన్ కోసం గుర్రపు బండి పై నిరసన !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈయన పేరు దులి చంద్.. వయసు 102 ఏళ్లు. ఢిల్లీ అధికారులు తన పెన్షన్ నిలిపివేయడంతో ఆందోళన చెందాడు. తన మనవడిని పట్టుకుని ప్రభుత్వ ఆఫీసు వెళ్లి అడిగాడు. దులి చంద్ చనిపోయినట్టుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉందని.. పెన్షన్ ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. తాను స్వయంగా ఆఫీసుకు వచ్చినా కూడా చనిపోయావని అనడం ఏమిటని దులి చంద్ నిలదీసినా లాభం లేకపోయింది. దీంతో దులి చంద్, ఆయన మనవడ, మరికొందరు కలిసి సరికొత్త నిరసన ప్లాన్ చేశారు. దులిచంద్ తెలుపు రంగు పైజామా, కుర్తా ధరించి.. శుభకార్యాల సమయంలో ధరించే టోపీ పెట్టుకుని.. గుర్రపు బండిలో ప్రభుత్వాఫీసుకు భారీ ఊరేగింపుగా వెళ్లాడు. ఈ నిరసనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘ఈ నిరసన ఏదో చిత్రంగా చాలా బాగుంది’ అని కొందరు అంటుంటే.. ‘ఇలాంటివి చూసి అయినా ప్రభుత్వ అధికారులకు సిగ్గు రావాలి’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.