బీఎస్పీ కీలక బాధ్యతలు మాయావతి అల్లుడికి .. !
1 min readపల్లెవెలుగువెబ్ : బీఎస్‌పీ అధినేత్రి మాయావతి తమ మేనల్లుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో జరుగనున్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించే కీలక బాధ్యత ఆయన భుజస్కంధాలపై పెట్టారు. తద్వారా పార్టీలో నెంబర్-2 స్థానానికి ఆయనను ఫోకస్ చేయాలని మాయవతి అభిలషిస్తున్నట్టు చెబుతున్నారు.