గణపతి లడ్డూ వేలం రూ.3.33 లక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్: తొమ్మిది రోజులపాటు అశేష పూజలు అందుకున్న వినాయకుడి లడ్డూ .. వేలం పాటలో రూ. 3లక్షలకుపైగా పలికింది. నగరంలోని శ్రీ ఈశ్వర రామాంజనేయ స్వామి దేవాలయంలోని వినాయకుడి లడ్డూను జమ్మిచెట్టు గుడి, హౌసింగ్ బోర్డు కాలనీ, బీ క్యాంపునకు చెందిన జైని శిరీష మరియు వాళ్ల టీం రూ.3,33,501 లకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జైనీ నవ్య, రాయపు స్వామి లతారెడ్డి మరియు దళపతి టీం సభ్యులు పాల్గొన్నారు.