పదోన్నతి పరీక్షకు..నిబంధనలు పాటించాలి: ఆర్జేడి పద్మజ
1 min readపల్లెవెలుగు వెబ్: గ్రేడ్-2 సూపర్వైజర్గా పదోన్నతి కల్పించేదుకు నిర్వహించే పరీక్షకు సంబందించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు అంగన్వాడీ కార్యకర్తలు పాటించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆర్.జే.డి. పద్మజ తెలిపారు. కర్నూలు రీజియన్ పరిధి ( రాయలసీమలోని 8 జిల్లాలు)లో మొత్తం 216 పోస్టులకుగాను 5712 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు అర్బన్ కార్యాలయంలో అభ్యర్థులకు సంబందించిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జేడి పద్మజ మాట్లాడుతూ కర్నూలు రీజియన్లోని అర్హత ఉన్న అంగన్వాడీ కార్యకర్తల నుంచి వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించామన్నారు. ఈ నెల 18న జరిగే పరీక్షకు రీజియన్ పరిధిలో 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే అంగన్వాడీ కార్యకర్తలకు హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు. హాల్టికెట్ పొందిన అంగన్వాడీ. కార్యక్షలు ఈ కింది నిబంధనలు పాటించాలన్నారు. హాల్ టికెట్ పొందిన వెంటనే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం చిరునామాను అంగన్వాడీ కార్యకర్త తెలుసుకోవాలి. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నా పత్రంలో ఇచ్చిన గదులను (0-బబుల్స్) బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నుతో పూరించాలి. ఒక ప్రశ్నకు ఒక సమాధానాన్ని మాత్రమే పూరించాలి. ఒకటికి మించి ఎక్కువ సమాధానాలను పూరిస్తే నెగెటివ్ మార్కులు కేటాయించబడును. పరీక్షా కేంద్రంలో ప్రతి అభ్యర్థికి ఓ.ఎం.ఆర్. షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓ.ఎం.ఆర్.షీట్నుబ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నుతో పూరించాలి. ఓ.ఎం. ఆర్. షీట్లో హాల్టిక్కెట్ నంబర్ను బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నుతో పూరించాలి. ఎవరైతే ఓ. ఎం. ఆర్. షీట్లో హాల్ టిక్కెట్ నంబర్ పూర్తి చేయరోవారిని అనర్హురాలిగా పరిగణించబడును. ఓ.ఎం. ఆర్. షీట్ కేటాయించిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని మాత్రమే పూరించాలి. తప్పులు చేస్తే 0.25 నెగెటివ్ మార్కులు ఓ.ఎం. ఆర్. షీట్ ఇచ్చిన గదులను (0-బబుల్స్) పూర్తిగా పూరించాలి. ఓ.ఎం. ఆర్. షీట్లో ఇచ్చిన గదులను (0-బబుల్స్) అరకొరగా పూరిస్తే మార్కులు కేటాయించబడవు అని తెలిపారు.