వైసీపీకి సారీ చెప్పిన టీడీపీ నేత
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ యువ నేత జీవీ రెడ్డి తన హుందాతనాన్ని ప్రదర్శించారు. అధికార పార్టీ వైసీపీకి ఆయన సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు. ఈ మేరకు బుధవారం తన ట్వీట్లో దొర్లిన తప్పును సరిచేస్తూ మరో ట్వీట్ చేసిన జీవీ రెడ్డి.. ఆ విషయాన్ని వైసీపీకి చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు. తన తొలి ట్వీట్లో ఓ తప్పు దొర్లిందని, దానిని రెండో ట్వీట్లో సరిచేశానని చెప్పిన జీవీ రెడ్డి.. జరిగిన పొరపాటుకు ‘ఎక్స్ట్రీమ్లీ సారీ’ అంటూ వైసీపీకి తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉందని నిన్నటి కేంద్రం గణాంకాల్లో వెల్లడైందని వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కౌంటర్ ఇచ్చిన జీవీ రెడ్డి… ఆ గణాంకాలను పూర్తిగా పరిశీలిస్తే తొలి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో గుజరాత్ ఉన్నాయని, ఇందులో ఏపీ సాధించిందేమీ లేదని తేలిందని ట్వీట్ చేశారు.