ఏపీ మాజీ ఎంపీకి ఐదేళ్ల జైలు శిక్ష
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు షాక్ తగిలింది. హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధించింది. బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ మేరకు శిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించి 2015లోనే సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది.