పోయిన మొబైల్ ను ఇలా కనిపెట్టండి !
1 min readపల్లెవెలుగువెబ్ : పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రాక్ చేయడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పేరుతో ఒక సరికొత్త యాప్‌ను రూపొందించింది. మొబైల్ పోగొట్టుకున్నపుడు వాటి వల్ల జరిగే నేరాలు, తప్పుడు పనులను అరికట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే..పోయిన మీ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు. దాని కోసం సీఈఐఆర్ వెబ్సైట్ మీకు పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ మీ ఫోన్‌లో వేరేవారు సిమ్ వేసుకుని వాడుతున్నా కూడా మీ మొబైల్ యాక్సెస్‌ను బ్లాక్ చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీ మొబైల్ వేరేవాళ్ళ చేతుల్లో ఉన్నా మీ పేరుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపవచ్చు. అయితే దీనికోసం ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. అదే పోలీసులకు ఫిర్యాదు చేయడం. మొబైల్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదులో పోయిన మొబైల్ మోడల్, ఆ మొబైల్ ఐఎంఈఐ నంబర్, మొబైల్ కంపెనీ వంటివన్నీ పొందుపరచాలి. ఇవన్నీ చేసిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. దీని తరువాతనే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో మీ మొబైల్ గురించి ట్రాక్ చేయడం వీలవుతుంది.