రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్
1 min read
పల్లెవెలుగువెబ్ : టెన్నిస్ ప్రపంచంలో మహోన్నత క్రీడాకారుడు అనదగ్గ స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలికాడు. టెన్నిస్ పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. వచ్చేవారం లండన్ లో జరిగే లేవర్ కప్ తన చిట్టచివరి టోర్నీ అని స్పష్టం చేశాడు. స్విట్జర్లాండ్ కు చెందిన 41 ఏళ్ల ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. అయితే కరోనా సంక్షోభం వచ్చాక ఫెదరర్ పెద్దగా పోటీల్లో పాల్గొనలేదు. గతేడాది వింబుల్డన్ టోర్నీ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మూడేళ్లు గాయాలు, శస్త్రచికిత్సలతోనే సరిపోయిందని ఫెదరర్ తన రిటైర్మెంట్ ప్రకటనలో విచారం వ్యక్తం చేశాడు.