సముద్రం పై తేలే మంచు చిత్రాలు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్ట్ వేయాలంటే కాన్వాస్ కావాలి. కాగితాలో, వస్త్రాలో కావాలి. ఇవేవీ కాకుంటే కనీసం చదునుగా ఉన్న గోడలపైనా చిత్రాలు వేస్తుంటారు. కానీ అత్యంత చిత్రంగా నదులు, సముద్రాలపై తేలే మంచుపై చిత్రాలు వేస్తూ ఓ అమెరికన్ ఆర్టిస్ట్ ‘చిత్రం’గా అలరిస్తున్నాడు. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఆయన పేరు డేవిడ్ పోపా. చలికాలంలో మంచుతో గడ్డకట్టుకుపోయే దేశాల్లో పర్యటిస్తూ.. నదులు, సరస్సులు, నీటి ప్రవాహాల్లో మంచుపై చిత్రాలు గీస్తూ ఉంటాడు. మంచుపై చిత్రాలు వేస్తుంటాడంటే ఏదో అల్లాటప్పాగా ఏమీ ఉండవు. కాన్వాస్ పై వేసినంత అందంగా ఉంటాయి. చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంటాయి. ప్రస్తుతం ఫిన్లాండ్ లోని బాల్టిక్ సముద్రంలో మంచుపై పోట్రెయిట్స్ గీస్తున్నాడు. మంచు ఫలకలపై చిత్రాలు గీసేందుకు మూడు నుంచి నాలుగు గంటలు పడుతుందని ఆయన చెబుతున్నాడు.