ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టిన జగన్
1 min readపల్లెవెలుగువెబ్ : వచ్చే ఎన్నికలకు తన టీంను సిద్దం చేసుకొనేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలతో పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలంతా మమేకం కావాలని పదే పదే చెబుతూ వచ్చారు. వారికి సమయం ఇచ్చారు. వారి పని తీరు.. గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటి ఆధారంగానే పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం పైన సీఎం జగన్ తేల్చేసేందుకు సిద్దం
అవుతున్నట్లు తెలుస్తోంది అని ఓ నేత అన్నారు. ఈ నెల 19న సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మంత్రులతో పాటుగా పార్టీలోని ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీల పని తీరు పైన సమగ్ర నివేదికలతో సీఎం జగన్ ఈ సమావేశానికి హాజరు అవుతున్నారు. ఎమ్మెల్యేల్లో కొందరు పని తీరులో వెనుక బడి ఉన్నారని..వారు మెరుగు పరుచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని సీఎం ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో వారికి మరింత క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు హెచ్చరికలు చేసిన సీఎం జగన్..ఇప్పుడు ఎమ్మెల్యేల పని తీరు పైన తేల్చి చెప్పేందుకు సిద్దమయ్యారు.