బాలల హక్కులపై అవగాహన అవసరం..
1 min readజిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి సునీత
పల్లెవెలుగు వెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యం లో బాలల హక్కులు, జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, బాల్య వివాహ నిరోధక చట్టాల పైన స్థానిక చందన జూనియర్ కాలేజ్ నందు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ముందు గ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ G. సునీత మాట్లాడుతూ సమాజం లో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారని వారి కి గ్రామ స్థాయి నుంచి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. లైంగిక వేదింపులు కు గురి అవుతున్నటువంటి పిల్లలు, బాల్య వివాహాలు కు, బాల కార్మికులు, బిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలు, మానసిక సమస్యల తో బాధ పడుతూ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు….ఇలాంటి పిల్లల రక్షణ లో ప్రతి ఒక్కరూ బాగం కావాలని, ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది B. నాగేశ్వర్ Good neighbours India, B. వినోద్ కుమార్ సోషియల్ వర్కర్, ప్రిన్సిపాల్ సుబ్బారాయుడు గారు, కరెస్పాండెట్ రాజేశ్వరమ్మ , సిబ్బంది మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.