ఆ కార్యక్రమాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలి
1 min readపల్లెవెలుగువెబ్ : ఛీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కే. మీనా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలెంటీర్‌లను దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే ఎవరికైనా అటువంటి పనులు అప్పగిస్తే… వాటిని వెంటనే పక్కన పెట్టాలని సూచించారు. ఆధార్ నెంబరుకు, ఓటర్ ఐడీని అనుసంధానం చేయడానికి వలంటీర్లను ఉపయోగించవద్దని కోర్టు ఆదేశించింది. వలంటీర్‌లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఏజెంట్‌లుగా ఉండకూడదని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వెంటనే ఈ సమాచారం చేరవేయాలని ఎం.కే. మీనా ఆదేశించారు. టీడీపీ ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ చేసిన ఫిర్యాదుతో ఛీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.