జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు
1 min readపల్లెవెలుగువెబ్: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్సును మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ముంబైలో ఆ సంస్థ ప్లాంటులో తయారవుతున్న పౌడర్‌లో నాణ్యత లేదని రాష్ట్ర ఆహార, ఔషధ యంత్రాగం శుక్రవారం పేర్కొంది. పౌడర్‌లోని పీహెచ్ వాల్యూ, అనుమతించిన పరిమితులకు మించి ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. రాష్ట్ర యంత్రాంగం ఇప్పటికే సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. సంస్థ ఆ నోటీసులను కోర్టులో సవాలు చేసింది. కాగా, తాము టాల్క్ ఆధారిత బేబీ పౌడర్‌ను వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తున్నట్లు గత నెలలో జాన్సన్ సంస్థ ప్రకటించింది.